‘నపథ్యమ్ కదళీ ఫలమ్’
వందగ్రాముల అరటిపళ్లలో నీరు -
70.1 గ్రా.,ప్రోటీన్ - 1.2 గ్రా, కొవ్వుపదార్థాలు
- 0.3 గ్రా., పిండి పదార్థాలు - 27.2 గ్రా.. కాల్షియం - 17 మి.గ్రా. ఇనుము - 0.4మి.గ్రా.
సోడియం - 37 మి.గ్రా., పొటాషియం - 88 మి.గ్రా.,
ఇంకా రాగి , జింకు లాంటి ఖనిజాలు, లవణాలు, విటమిన్లూ
ఇందులో ఉన్నాయి. 23% ఉన్న
కార్బోహైడ్రేట్లవలన 7౦% నీళ్ళు ఉన్నప్పటికీ, వీటినుండి
రసం వేరు కాదు. మిక్సీ పట్టినా అది గుజ్జుగా మారిపోతుందే తప్ప రసంగా రాదు. భాభా
ఆటామిక్ పరిశోధనా సంస్థ వారు ఓ ప్రతేకమైన పద్ధతిలో అరటి
పళ్ళ రసాలు తయారు చేసి పేటెంటు పొందారు. అధిక కార్బోహైడ్రేట్లవలన షుగరు వ్యాధి, స్థూలకాయం ఉన్నవారికి ఇవి వ్యాధిని పెంచేదిగానే ఉంటాయి
‘నపథ్యమ్ కదళీ ఫలమ్’ అన్నారు. అరటి పండును అన్ని జబ్బుల్లోనూ పెట్టవచ్చని దీని భావం.
· శరీరంలోని
విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది.
· రాత్రిపూట
పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
· అరటిపండులోని
పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
· జబ్బుపడినవాళ్ళకి
అరటి పళ్ళు శక్తిదాయకంగా ఉంటాయి.
· పచ్చి
అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధకాన్నీ అల్సర్ల నూ అరికడతాయి.కడుపులో) యాసిడ్‘ని తగ్గిస్తాయి. పేగుపూత ఉన్నవారికి ఇది మంచి ఆహారం
· అరటిలో
పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. గుండె
ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం
· అరటిపండులో
పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ
కాపాడతాయి.
కామెంట్‌లు