నిమ్మ చేసే మేలు ....









100 గ్రాముల నిమ్మపండులో 40 కాలరీల శక్తి లభిస్తుంది. ఇతర ఆహార పదార్ధాలతో పోలిస్తే నిమ్మలోని పోషకవిలువలు అధికం. ఈ పోషక విలువలన్నీ ప్రతి మనిషికీ అవసరమైనవే. మెదడు చురుగా పని చేయలంటే పొటాషియం, దంతాలు, ఎముకలు పటిష్ఠంగా ఉండడానికి నిమ్మ ఎంతగానో సహకరిస్తుంది.
అంతేగాకుండా, ఊబకాయంతో బాధపడేవారు ప్రతిరోజూ రెండు లేదా మూడుసార్లు నిమ్మరసం తాగితే, బరువు తగ్గుతారు. రోజుకు నాలుగుసార్లు నిమ్మరసం గనుక తీసుకున్నట్లయితే పచ్చకామెర్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అలాగే వేడినీటిలో నిమ్మరసం పిండి తాగినట్లయితే, ఉబ్బసం నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇక జీర్ణక్రియ వ్యాధులైన మలబద్ధకం, అజీర్ణం లాంటి వాటిని తగ్గించటంలో నిమ్మరసం సహాయపడుతుంది. నిమ్మరసాన్ని రెండు పూటలా తీసుకునేవారిలో జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. దీనివల్ల ఆకలి పెరుగుతుంది. శరీరంలో నీరు చేరినట్టివారు, వాపులతో బాధపడేవారు కూడా, వేడినీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే, మూత్ర విసర్జన అధికంగా జరిగి రోగ నివారణకు తోడ్పడుతుంది.
గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టు మొదలైన చర్మవ్యాధులతో బాధపడేవారు నిమ్మరసాన్ని రోజులు రెండు లేదా మూడుసార్లు తీసుకున్నట్లయితే, చక్కటి ఫలితం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవారు వారానికి ఒకసారి నిమ్మనూనె రుద్దుకుంటే చర్మానికి ఆరోగ్యం, కాంతి చేకూరుతాయి. నల్లమచ్చలు నివారణకు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది.
ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండుసార్లయినా పళ్ళు తోముకుంటే పలువర మెరవడమే కాకుండా, చిగుళ్ళ వ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరం నీరసించినపుడు సెలైన్‌కు ప్రత్యామ్నాయంగా కొబ్బరినీటిలో నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల తక్షణ శక్తి కలుగుతుంది.
ఇన్ని సుగుణాలు కలిగిన నిమ్మమొక్కను ప్రతిఒక్కరూ ఇళ్లలో పెంచుకోవడం చాలా అవసరం. పెంచుకునే వీలులేనివారు బజార్లో కొనుక్కునయినా, ప్రతిరోజూ ఆహారంలోగానీ, విడిగాగానీ నిమ్మరసాన్ని తప్పనిసరిగా వాడాలి. నిమ్మరసాన్ని వాడినట్లయితే డాక్టర్లు, మందుల అవసరం అంతగా రాకపోవచ్చు. ఇక సైడ్ ఎఫెక్ట్‌ల గొడవ అసలే ఉండదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం