పిల్లలా ? పిడుగులా?
ఈ రోజుల్లో పిల్లల్ని చూస్తుంటే ఆశ్చర్యం , అనందం కలుగుతున్నాయి వాళ్ళ తెలివితేటలకు . అదే సమయంలో ఆందోళన కూడా కలుగుతోంది వయసుకు మించి తెలివి తేటలు ఉన్నాయా అని . వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే అసలు మనకు ఇప్పటికి తట్టవు వీళ్ళకి ఎలా వస్తున్నాయి ? మాటకి తడుముకోరు అనిపిస్తుంది . నేను స్వయంగా విని ఆశ్చర్యపోయా . చూద్దాం మీరేమంటారో మరి .
మా మేనల్లుడు ఉన్నాడు వాడు వాళ్ళ నాన్నతో ఏదో కొనమంటే చూద్దాం అన్నారట . వాడు వెంటనే 'ఏమిటి డాడీ అలా అంటావు . ఏదైనా అడిగితే వెంటనే కొని ఇచ్చేయాలి అంతే . అదే నేనైతే ఇలాచేయను 10 రూపాయలు చాక్లెట్ అడిగితే 100 రూపాయలు చాక్లెట్ కొంటాను . హాయ్ లాండ్ తీసుకు వెళ్ళమంటే థాయ్ లాండ్ తీసుకువెళతా ' అన్నాడట . అవి సొంత మాటలో ఏదైనా సినిమాలో డైలాగులో నాకు తెలియదు మరి.
మా వాళ్ళ అబ్బాయే మరొకడు వాళ్ళ అమ్మని స్కూల్ కి ఎ.సి బస్సు లో వెళతానంటే , అంత అవసరం లేదురా ఇంట్లో వేసుకుంటాము కదా మరీ బస్సు లో కూడా ఉండాలా అందట . దానికి 4 చదువుతున్న వాడు అమ్మా మనకంత కెపాసిటి లేదా అన్నాడట . 2 చదువుతున్న వాళ్ళ తమ్ముడు లేదురా అలా చెప్పలేక అవసరం లేదు అంటోంది అంతే అన్నాడట ఏమనాలి వాళ్ళని మీరే చెప్పండి .
సినిమాలు , టి . వి లు చూసి అలా మాట్లాడుతున్నారు . చిన్న పిల్లలతో ముదురు డైలాగ్స్ చెప్పించడం చాలా సినిమాలలో చూస్తుంటాం . పిల్లలకు అలాటివి చాలా తొందరగా గ్రహించే శక్తి ఉంటుంది . వాటిని మాట్లాడేస్తారు . అందులోని మంచి , చెడు వాళ్లకి తెలియవు కదా . విన్నవి మనం మాట్లాడ వచ్చా లేదా అనేది తెలియదు . సినిమాలలో మాట్లాడు తున్నారు మనం మాట్లాడితే తప్పేముంది అనే భావం కూడా ఉంటుంది .
కామెంట్‌లు