బంగాళా దుంప -- బహు ప్రీతి
ప్రపంచ వ్యాప్తంగా లభించే కూరగాయల్లో
బంగాళాదుంప ఒకటి. పొటాటో చిప్స్, పొటాటో కుర్మా... ఇలా అనేక రకాలైన వెరైటీలను బంగాళాదుంపలతో
చేస్తుంటారు. పుష్కలంగా
పిండి పదార్థాలను కలిగి ఉన్న ఈ దుంపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
బంగాళాదుంపలో ఉండే బి6 విటమిన్ శరీరంలోని ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తాయి. ఆలులో ఉన్న పీచు పదార్థం గుండెజబ్బుల నుండి రక్షణనిస్తుంది. భోజనం చేసే ముందు ఒకటి లేదా రెండు చెంచాల ఆలూ రసం తీసుకుంటే రుమాటిజం తగ్గుతుంది. పచ్చి బంగాళాదుంప రసం తీసుకుంటే జీర్ణాశయం, పేగుల ఇబ్బందులు తొలగుతాయి.
బంగాళాదుంపలను సన్నగా కోసి ఆ ముక్కలను అలసిన కళ్లపై పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే పచ్చి దుంప రసాన్ని ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా ఉంటుంది. బాలింతలకు బాగా పాలుపడాలంటే బంగాళాదుంపలను ఆహారంలో చోటు కల్పిస్తే సరి.
ఇన్ని ఉపయోగాలున్న బంగాళాదుంపలను స్థూలకాయులు మాత్రం తీసుకోకూడదు. షుగర్ వ్యాధితో బాధపడేవారు, కీళ్ల నొప్పులున్నవారికి ఇది మంచిది కాదు. ఆకుపచ్చగా ఉండే బంగాళాదుంపలలో సొలనైన్ అనే పదార్థం టాక్సిన్‌గా పనిచేస్తుంది. కనుక వాటిని తీసుకోకూడదు.
సహజంగా చాలామంది బంగాళాదుంపలను మాంసంతో కలిపి వాడటం వల్ల సొలనైన్ ఎక్కువై, జననావయవాలకు దురద కలిగే అవకాశం ఉంది. సుఖవ్యాధులతో బాధపడేవారు బంగాళాదుంపలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.

కామెంట్‌లు