దానిమ్మ సుగుణా లెన్నో ...








దానిమ్మతో ఆరోగ్య ప్రయోజనాలు:-
1.అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
2. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. దానిమ్మ పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
3.ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.
4. గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.
5.ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
6.అధికరక్తపోటు తో బాధపడు తున్నా లేక ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి వున్నా లేదా గుండెను కాపాడే ''హెచ్.డి.ఎల్. కొలెస్టిరాల్ '' 50 కన్నా తక్కువగా ఉన్నా... ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడము మంచిది. . గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది . మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు ... మంచిది .
7.దానిమ్మ పువ్వులను ఎండబెట్టి పొడికొట్టి డబ్బాలో భద్రపరుచుకుని ఒక పూటకు ఒక చిటికెడు మందులా తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
8.దానిమ్మ పువ్వుల్ని తలలో పెట్టుకుంటే తలనొప్పి, శరీర ఉష్ణం తగ్గిపోతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం