ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ వార్తను చూసి వ్రాస్తున్నా . మన దేశ జనాభా సుమారు నూట పది కోట్లు దాటింది . కాని మన దేశం నుంచి ఒలింపిక్స్ లో పతకాలు సాధించే వారెందరు , నోబెల్ బహుమతులు సాధించిన శాస్త్రవేత్తలు ఎందరు , అని చాలామంది బాధ పడుతుంటారు . మన దేశంలోనూ గుర్తించదగిన పరిశోధనలు చేసే సంస్థలు , శాస్త్రవేత్తలు ఉన్నారు . కాని ఇంకా సాధించాల్సిన మైలురాళ్ళు ఎన్నో ఉన్నాయి . పరిశోధించాల్సిన అంశాలు ఉన్నాయి . నిజానికి మన దేశం గతమెంతో ఘనకీర్తి కలిగినది . మరి ఆ గతాన్ని మర్చిపోకుండా , వర్తమానంలో తగిన కృషి చేస్తే భవిష్యత్తు మనదే . ఒకసారి వెనక్కి చూస్తే ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలచిన రంగాలెన్నో . తక్షశిల , నలంద విశ్వవిద్యాలయాలలో వేలమంది విద్యార్ధులు దేశ విదేశాలనుంచి వచ్చి చదువుకొన్నారు . అశోకుడు విద్యాభ్యాసం చేసింది తక్షశిల విశ్వవిద్యాలయంలోనే . అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు ఇక్కడే ఆర్ధికశాస్త్ర విభాగ అధిపతిగా పనిచేసారు . గురుకుల విద్యావిధానాన్ని ప్రపంచానికి ప...