ఇండోర్ ప్లాంట్స్ ఉపయోగాలెన్నో

ప్రకృతి ప్రసాదించిన పచ్చదనం మానవ చర్యల వల్ల తరిగిపోతోంది . ఫలితంగా వాతావరణం కలుషితమైపోతోంది . దీంతో మనుషులు అనేక రకాల అనారోగ్యాలకు లోనవుతున్నారు . నాలుగు గదుల మధ్య ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపేవారు కాలుష్యాల వల్ల త్వరగా అ లసిపోతారు . మనస్సు , శరీరం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు సజావుగా చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది . ఆఫీసులో మనస్సుకు ఆహ్లాదం ఉత్తేజం కలిగించేందుకు పచ్చని మొక్కలు , పుష్పాలు అవి అందించే సువాసనలు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి . బయటి వాతావరణం కంటే ఆఫీసుల్లో సరైన గాలి , వెలుతురు రాకపోవడం వల్ల కాలుష్యం 5 రెట్లు పెరుగుతుందని న్యూయార్క్ కు చెందిన ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఫిజిషియన్ జేమ్స్ డిల్లార్డ్ . ' ప్లాంట్స్ వై . యు కెనాట్ లివ్ విత్ దెమ్ పుస్తకరచయిత బిల్ ఓల్వ్ టర్న్ లు తెలియజేస్తున్నారు . ఐతే ఏ మొక్కలైతే ఎక్కువ ఉపయోగంగా ఉంటాయో వారు వివరించారు . ఏవి ఎంచు కోవాలనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది . గదిలోకి సూర్యకిరణాలు , వెలుతురు ఏ మేరకు వస్తుంది ....