దాహం వేసినపుడు నుయ్యి తవ్వడం


ఆ మధ్యన కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో నాకు ఆవేశం వచ్చేసింది మనకి పెరడు కొంచెం కాళీగా ఉంది కదా అన్ని రకాలు విత్తనాలు తెచ్చి పండించు కొంటే చాలా బాగుంటుంది . బోలెడు ఆదా చేసెయ్యొచ్చు అని .  ఆలోచన వచ్చి నాకు గుర్తుండి , కుదిరి బజారుకు వెళ్లినపుడు విత్తనాలు తెచ్చి , ఇంట్లో పెట్టాను . దానికి కొన్ని రోజులు పట్టింది . మళ్ళి వాటిని గుర్తుంచుకొని నేలలో వేయడానికి మరికొన్ని రోజులు పట్టింది . సరే ఎలాగైతేనేం తెచ్చిన వాటిలో కొన్ని మొక్కలు వచ్చాయి . బెండ మొక్కలు, బొబ్బర్లు , వంగ , బీర, ఆనప మొక్కలు వచ్చాయి . పూత పట్టింది.   తీరా పిందెలు వేసాయి అనే సమయానికి కూరగాయల ధరలు కిందికి దిగివచ్చాయి.
  ఇది చాలా చిన్న విషయం అనుకోండి . కాని చాలా విషయాలలో  సమయం ఉన్నం తసేపు ఆ విషయాన్ని పట్టించుకోము . ఏదైనా పీకల మీదకు వచ్చాక పరుగులు పెడుతుంటాం .
కరెంట్ , ఫోన్ బిల్లులు మొదలైనవి చూడండి ఆఖరి రోజు చాలా మంది కడుతుంటారు . ఆ రోజు చాల జనం ఉండి సమయం ఎక్కువ పడుతుంది అదే మనకి బిల్లు రాగానే కుదిరినపుడు చెల్లించేస్తే ఆఖరి రోజు ఖంగారు ఉండదు . అలాగే పరీక్షల ఫీజు కట్టడానికి కూడా మనకు చాల రోజుల ముందు తెలిసినా చివరి వరకు ఊరుకుని ఆ రోజు రద్దీగా ఉందని తిట్టుకుంటాం .
ఈ రోజుల్లో పిల్లలందరూ ఉన్నత చదువులు చదవటం , పై చదువులు కోసమో , ఉద్యోగం కోసమో , ఆడ పిల్లలు పెళ్లి అవటం వలనో విదేశాలకు వెళ్ళే అవసరం కలుగుతోంది . ముందు నుంచి ఊరుకొని ఈ నెలలోనే వెళ్లి పోవాలి అన్నపుడు పాస్ పోర్ట్ కోసం ఉరుకులు , పరుగులు , తత్కాల్ లు అని చూస్తుంటాము . ప్రతి పనికి కొంత నిర్దేశిత సమయం పడుతుంది అది తప్పనిసరి కదా . మనకి మాత్రం త్వరగా అయిపోవాలని కంగారు . దాన్ని ఎలాగైనా చేయించు కోవాలని అడ్డ దారులు వెతకటం . తద్వారా అవినీతిని ప్రోత్సహించడం జరుగుతుంది . అదే పిల్లలు డిగ్రీలు చదువుతున్నపుడు పాస్ పోర్ట్ కి దరఖాస్తు చేసాం అనుకోండి నెమ్మదిగా వస్తుంది . మనకు నిజంగా అవసర మయ్యే సమయానికి ఎలాగైనా వస్తుంది . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం