మిక్సీ వాడండి ఇలా
మిక్సీని ఉపయోగించినప్పుడు జార్లో కొంత పదార్థం బ్లేడ్స్ క్రింది బాగంలో మరియు మిక్సీ మీద మరియు మిక్సీ క్రింద భాగం, మిక్సీ వెనుక భాగంలో పడి చూడటానికి అసహ్యంగా తయారవుతుంది. కాబట్టి, మిక్సర్ గ్రైండర్ ను ఉపయోగించినప్పుడు, ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయడం వల్ల చూడటానికి అందంగా ఉండటంతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రతను, ఆరోగ్యభద్రత తెలిసినవారు అవుతారు. కాబట్టి, ఇంట్లో మిక్సర్ గ్రైండర్ ను వుభ్రం చేయడానికి వివిధ రకాల నేచురల్ పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మెటల్ వస్తువులను శుభ్రం చేయడానికి ఈ పదార్థాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఈ పదార్థాలను ఉపయోగించి మీ మిక్సీ గ్రైండర్ ను శుభ్రం చేయడానికి మరియు నిల్వ చేరిన పదార్థాల యొక్క దుర్వాసనను నివారించడానికి ఈ పదార్థాలు సహాయపడుతాయి. మరి ఆ పదార్థాలోంటో ఒక సారి చూద్దాం... నిమ్మ తొక్క: నిమ్మ కాయ నుండి నిమ్మరసంను పూర్తిగా పిండుకొన్న తర్వాత ఆ తొక్కను ఉపయోగించుకోవచ్చు. మిక్సర్ గ్రైండర్ ను వచ్చే చెడు వాసనను తొలగించడానికి నిమ్మతొక్క బాగా సహాయపడుతుంది. నిమ్మతొక్కతో మిక్సీ జార్ మీద బాగా రుద్ది 15నిముషాల తర్వాత శుభ్రం చేయడం వల్ల వాసనతొలగిపోతుంది. మరకలను తొలగించే వెనిగర్ : కొన్న వెజిటేబుల్స్ వల్ల మిక్సీ జార్ల మీద మొండి మరకలు ఏర్పడుతాయి. వీటిని తొలగించడానికి వెనిగర్ బాగా సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ మరియు నీళ్ళు మిక్స్ చేసి మిక్సర్ గ్రైండర్ లో పోసి రెండు సెకండ్లు అలాగే ఉంచి తర్వాత తిరిగా అదే పద్దతిని అనుసరించి తర్వాత మంచి నీటితో కడిగి శుభ్రం చేయాలి. బేకింగ్ పౌడర్ : కొద్దిగా నీళ్ళు తీసుకొని, బేకింగ్ పౌడర్ వేసి పేస్ట్ లా తయారుచేయాలి., ఈ పేస్ట్ ను మిక్సర్ గ్రైండర్ , జార్లకు పట్టించి 15నిముషాలు అలాగే పక్కన పెట్టి, ఆతర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. డిటర్జెంట్ లిక్విడ్: ఒకటి లేదా రెండు చుక్కల డిటర్జెంట్ లిక్విడ్ ను మిక్సర్ గ్రైండర్ లో వేసి, కొద్దిగా నీటిని చిలకరించి రెండు మూడు నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. మిక్సర్ గ్రైండర్ శుభ్రం చేయడానికి ఇది కూడా ఒక ఉత్తమ మార్గం. ఆల్కహాల్: మిక్సర్ గ్రైండర్ లో చెడు వాసనను నివారించడానికి మరియు కొత్తవాటిలా మెరిపించడానికి ఆల్కహాలు కూడా సహాయపడుతుంది కొద్దిగా ఆల్కహాల్ ను నీటితో మిక్స్ చేసి ఆ నీటిని మిక్సర్ గ్రైండర్ మీద చిలకరించి 10నిముషాలు తర్వాత శుభ్రం చేయాలి.
కామెంట్‌లు