ఆహ ఆకు కూర




ఏవంట చేసినా... చివరగా కొత్తిమీర చేరిస్తే రుచే వేరు. అయితే రుచిమాత్రమేకాదు మనకు పుష్టినీ ఇస్తుంది కొత్తిమీర. ప్రతి వందగ్రాముల కొత్తిమీరలో... పదిమిల్లీగ్రాముల ఐరను, 135 మిల్లీగ్రాముల విటామిన్ సి, విటమిన్ లతోపాటు, ఫాస్ఫరస్, కాల్షియం సమృధ్ధిగా లభిస్తాయి. చట్నీ, జ్యూస్ రూపంలోకూడా అందులోని పోషకవిలువలను గ్రహించవచ్చు.
పప్పు, కూర, పులుసు, బజ్జీలు, పాలక్ పన్నీర్...రకరకాలుగా తినే పాలకూరల్లో అమినోయాసిడ్స్, ఐరన్, విటమిన్ , మెగ్నీషియం, సల్ఫర్, పోటాషియం, పోలిక్ యాసిడ్ పుష్కలం. ఒక్కమాటలో చెప్పమంటే మాంసాహారంలో ఉండే మాంసకృత్తులన్నీ పాలకూరలోనూ ఉంటాయి.
పాలకూరలో ఉండే సుగుణాలన్నీ మెంతికూరలోనూ లభిస్తాయి. ఖనిజ లవణాలతో పాటు.. అన్ని రకాల విటమిన్లూ లభిస్తాయందులో.
పరిమళభరిత పుదీనాలోనూ విటమిన్లకు, ఖనిజలవణలకు కొదవేమీలేదు. ఐరన్, విటమిన్ పుష్కలంగా ఉంటుంది.
తోటకూర తరచుగా తినడంవల్ల , బి1, బి2, సి విటమిన్లు.. కాల్షియం, ఐరన్, పొటాషియం, లోపాలకు చక్కని పరిష్కారం. చర్మాన్ని తొందరగా ముడుతలు పడనీయదు కూడా!




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం