పొడవైన కురుల కోసం







1. పసుపు కొమ్ము అరగదీసి ఆ గంధమును తలకు పట్టించి అరగంట తరువాత చన్నీటితో స్నానం చేయాలి.
2.
సీతాఫలము ఆకు రసము తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి.
3.
గురివింద గింజలు నీటితో ముద్దగా నూరి , తలకి రాసి, ఒక గంట తరువాత స్నానం చేయాలి.
4.
వారానికి ఒకసారి కొబ్బరిపాలు తలకు పట్టించి అరగంట తరువాత చన్నీటితో స్నానం చేయాలి.
5.
ఉసిరికాయ చూర్ణాన్ని ఒక పాత్రలో నానపెట్టి ఉదయమే అందులో ఒక నిమ్మకాయ పిండి జుట్టుకు పట్టిస్తే ఏపుగా పెరిగి మెరుస్తూ ఉంటుంది.
6.
కొబ్బరినూనెలో వెల్లుల్లి పాయలను ఉడికించి తరువాత వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం