భలే చిట్కా !





* తలనొప్పిగా ఉన్నప్పుడు పళ్ళ మధ్యలో ఒక పెన్సిల్ ను పెట్టి గట్టిగా నొక్కి చూడండి. మన దవడ నుండి కణతలకు కనెక్ట్ అయి ఉన్న కండరంలోని వత్తిడిని ఇది తగ్గిస్తుంది. తద్వారా తలనొప్పి తగ్గిపోతుంది.
*
అతిమధురంను మెత్తగా పేస్ట్ చేసి దానిలో అర చెంచా పెట్రోలియంజెల్లీని కలిపి ఆనెల మీద పెట్టి చూడండి. చాలా త్వరగా తగ్గిపోతాయి.
*
పాదాలు లేక మడమలు నొప్పిగా ఉంటే పాదాన్ని టెన్నిస్ బాల్ లేక గోల్ఫ్ బాల్ మీద పెట్టి అటూ, ఇటూ నడవండి.
*
పిజ్జా లేక ఊతప్పం వంటివి వేడిగా తిన్నప్పుడు నాలుక పైన తాట లేచి మంట పుడుతుంది. అప్పుడు చల్ల చల్లని ఐస్ క్రీం కానీ, కూల్ డ్రింక్ కానీ తీసుకోండి.
*
పంటి దుర్వాసనను వదిలించుకోవాలంటే పెరుగు తినండి. పెరుగులోని మేలు చేసే బాక్టీరియా నోటి దుర్వాసనను కలిగించే బాక్టీరియాను నాశనం చేస్తుంది.
*
రోజూ 30 నిముషాలపాటు సంగీతం వినండి. రక్తపోటు అదుపులో ఉంటుంది.
*
ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఒక చెంచా చక్కెరను మింగితే వెంటనే తగ్గిపోతాయి. చక్కెర ఎక్కిళ్ళు కలిగించే కండరాలను సంకోచింపచేస్తుంది.
*
ట్రాఫిక్ లో చిక్కుకుని వత్తిడికి గురి అయినప్పుడు పిప్పరమింట్ లేక దాల్చిన చెక్కతో చేసిన బబుల్ గమ్ చప్పరించండి. ఇది వత్తిడినే కాక అలసటను, ఆందోళనను కూడా తగ్గిస్తుంది.
*
పళ్ళు తెల్లగా రావాలంటే రోజుకో ఆపిల్ పండు తినండి. ఆపిల్ లోని మాలిక్ ఆసిడ్ పళ్ళ మీద మచ్చలను తొలగించి తెల్లగా మెరిపిస్తుంది.
*
పులిపిరికాయను తొలగించుకోవాలంటే డక్ట్ టేప్ ను దాని మీద చుట్టి ఉంచండి. మూడు రోజుల తరవాత దానిని తీసివేసి ప్యుమిక్ స్టోన్ తో మృత చర్మాన్ని తొలగించి మరల కొత్త టేప్ తో చుట్టండి. ఇలా పులిపిరికాయ పోయేవరకు చేయండి. డక్ట్ టేప్ లోని కెమికల్స్ పులిపిరికాయను దాదాపు రెండు నెలల్లో పూర్తిగా నిర్మూలిస్తాయి.
*
రోజూ కొంచెం వెజిటబుల్ ఆయిల్ రాస్తే పెళుసుగా ఉన్న గోళ్ళు మృదువుగా మారతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం