గోల్డెన్ టెంపుల్ , బైలేకుప్పే

కుశల్ నగర్ నుంచి సుమారు ఆరు కిలోమిటర్స్ దూరంలో బైలెకుప్పె ఒక చిన్న గ్రామం . ఇది టిబెట్ జాతీయుల నివాస కేంద్రం . దీన్నే మినీ టిబెట్ అని కూడా అంటారు . టిబెట్ వారి సెటిల్ మెంట్ ఇది . దీనిని 1961 లో నిర్మించారు 


ఇక్కడ ఉన్నవి బౌద్ద సన్యాసులు నివసించే నివాస సముదాయం .

చక్కటి ప్రశాంత వాతావరణం లో నిర్మించిన ఈ దేవాలయాన్ని చూస్తుంటే మనకు పవిత్ర భావం కలిగి తీరుతుంది . ఎక్కడ చూసినా అత్యంత పరిశుభ్రంగా నిశ్శబ్ధంగా ఉంటుంది . బౌద్ద సన్యాసులు కొన్ని వేలమంది నివసిస్తున్నా ఎక్కడా ప్రశాంత తకు భంగం కలుగ కుండా ఎవరి పని వారు చేసుకు పోతున్నారు.

మేము సాయంత్రం వెళ్లేసరికి వారి ప్రార్ధనా సమయం కాబట్టి అందరూ ఒకే చోట కూర్చుని ప్రార్ధన పూర్తి చేసుకున్నారు . ఆ తరువాత అందరు ఒకే వరుసలో నివాసాలకు బయలు దెరారు. అందులో ఆరు సంవత్సరాల చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరు ఉన్నారు . 


 వారి చేతులలో వారు కూర్చుని ప్రార్ధన చేసుకొనేందుకు కావలసిన కుషన్స్ పట్టుకు వెళుతున్నారు చూడండి . ఇదే వారి ప్రధాన దేవాలయం .

వారి ప్రార్ధనా సమయంలో తప్ప మిగిలిన సమయాలలో అందరికీ లోపలికి ప్రవేశం ఉంది .

గోడలు , పై కప్పు అన్ని చోట్ల టిబెట్ వారి చిత్ర కళ కనిపిస్తుంది . ఎంతో చక్కని వర్ణాలతో , చిత్రించ బడ్డ చిత్రాలు చూపరులను ఇట్టే ఆకట్టు కొంటాయి . 

దేవాలయ గోపురాలు టిబెటన్ల శిల్ప కళా రీతికి అద్దం పడతాయి .



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం