కూర్గ్ లో విహరిద్దాం రండి



కూర్గ్ అనేది కర్ణాటకలో ఒక జిల్లా . నిజానికి దీనిని కొడగు జిల్లా అంటారు. కొడగు అంటే పశ్చిమం అని అర్ధం . ఇది పశ్చిమ కనుమలలో అరేబియా సముద్ర తీరానికి దగ్గరగా ఉంది . ఈ జిల్లాలోని ప్రజలు మాట్లాడే భాష కొడగు . ఈ భాష పై పక్కన ఉన్న తమిళనాడు, కేరళ భాషల ప్రభావం చాల ఎక్కువ . తమిళంలో 'కుట్టుక్కు' అంటే పశ్మిమం అని అర్దం . ఈ కూర్గ్ జిల్లా అంతా కూడా కాఫీ తోటలకు చాల ప్రసిద్ది. ఈ జిల్లాకు ఒక పక్కన కర్నాటక లోని హసన్ జిల్లా,మైసూర్ జిల్లా  మరొక పక్కన కేరళ లోని కన్నూర్ జిల్లా , మొదలైనవి ఉన్నాయి. ఈ అంతా పశ్చిమ కనుమాలతో నిండి ఉంటుంది. ఇక్కడ కాఫీ, మిరియాలు, తమలపాకులు, కొబ్బరి, కోకో , కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ ఎక్కువగా చల్లగా ఉండే ప్రదేశం కాబట్టి వేసవి విడిదిగా చాల మంది వస్తారు. ఇక్కడ టూరిజం కూడా బాగా ఎక్కువ ఆదాయ వనరుగా ఉపయోగపడుతోంది.

    ఈ కొడగు జిల్లా లోని తల కావేరి నందు కావేరి నది జన్మించింది. ఆ వివరాలు తలకావేరి ట్రిప్ లో తెలుసు కుందాం . ఈ కొడగు జిల్లలో మనం చూడవలసిన ప్రదేశాలు చాల ఉన్నాయి. కుశాల్ నగర్ సమీపంలో నిసర్గ్ ధాం , బైలే కుప్పె లోని బుద్దిస్ట్ మానేస్తేరి , ఏనుగుల కాంప్ డబురే ఎలిఫంట్ క్యాంపు , మడికేరి లోని , అబ్బే వాటర్ ఫాల్స్ ,తలకావేరి, భాగ్ మండల్ లోని త్రివేణి సంగమం ,ఇరుపు వాటర్ ఫాల్స్,  నాగర్ హోల్ లోని జాతీయ అభయారణ్యం మొదలైనవి ఎన్నో ఉన్నాయి.



           హసన్ నుంచి సుమారు డెబ్బది అయిదు కిలోమీటర్ల దూరంలో కుశాల్ నగర్ ఉంది. ఈ ఊరు కూర్గ్ జిల్లాకి ముఖద్వారం గా భావిస్తారు. ఇక్కడ మనం చూడవలసిన ప్రదేశాలు నిసర్గ్ ధాం , దుబారే ఎలిఫెంట్ కాంప్ , దగ్గరలోని బైలేకుప్పే అనే ప్రదేశం లోని గోల్డెన్ టెంపుల్ చాల చూడవలసిన ప్రదేశాలు.

ఈ కొడగు జిల్లా ముఖ్య పట్టణం మడికేరి . దీనినే ఇంగ్లీష్ లో మర్కేరి  అని కూడా అంటారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం