అంతర్జాతియ నగల పెట్టె


బేలూర్ దేవాలయాన్ని ఎందుకు అంతర్జాతియ నగల పెట్టె (ఇంటర్నేషనల్ జువేలరి బాక్స్ )అన్నారో క్రింది ఫోటోలు చుస్తే తెలుస్తుంది. దేవాలయం లోపలి భాగంలో నలబయ్ ఎనిమిది స్తంభాలు ఉన్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండవు. ప్రతి స్తంభం పైన గాజులు, హారాలు, వడ్డాణం తదితర అనేక నగల యొక్క నమూనాలు చెక్కబడి ఉన్నాయి. దేవాలయాన్ని నిర్మించిన రాజు విష్ణు వర్ధనుడు , ఆయన రాణి శాంతలా దేవి అభిరుచో మరి ఆనాటి శిల్పుల అబిరుచో తెలియదు కాని అన్ని స్తంభాలు చాలా పనితనంతో అనేక నగల నమూనాలు చిన్న చిన్న వివరాలు కూడా కనిపించేలా ఈ నాటికి మనం ఆ మోడల్స్ నగలు చేయిమ్చుకోవచ్చును అన్నట్లుగా ఉంటాయి. 

వడ్డాణాలు , నెక్లెస్ ల నమూనాలు చెక్కిన స్తంభం ఇది.

మెడలో వేసుకొనే రక రకాల నెక్లెస్ మోడల్స్ ఇవి .


ఇవన్నీ రకరకాల గాజుల మోడల్స్ చూడండి


గుడి లోని అన్ని శిల్పాలను ఈ స్తంభం పైన చెక్కారు దేవాలయం నమూనా అంతా ఇక్కడ చూడవచ్చును. 




దేవతా మూర్తుల విగ్రహాలకు కూడా అనేక రకాల మోడల్స్ నగలు చెక్కారు.


బడ్డాయి. ఇవి చీకటిగా ఉండటం వలన కనిపించవు. ఇక్కడ ఒక ప్లడ్ లైట్ ఏర్పాటు చేసారు. ఇరవై రూపాయిలు టికెట్ కొంటే ఆ దీపం సహాయంతో పైకి కాంతి ని ప్రసరింప చేసి చూపిస్తారు. మధ్యలో కనిపిస్తున్న స్తంభం పై త్రిమూర్తుల ఆకారాలు చెక్కారు. సృష్టి కర్త బ్రహ్మ (generation = G), స్థితి కారకుడు విష్ణువు ( organaisation = O) , లయ కారకుడు శివుడు ( distruction = D) కలిస్తే  GOD అయిందని గైడ్ వివరించాడు. అందుకే ముగ్గురి మూర్తులు ఒకే చోట చెక్కారని తెల్పాడు. 



గర్భ గుడిలో చెన్నకేశవస్వామి విష్ణువు దేవదానవులు క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని వెలికి తీసినపుడు  అమృతాన్ని రాక్షసులకు అందకుండా చేయడం కోసం ఎత్తిన మోహిని రూపంలో దర్సనమిస్తాడు. అందుకే స్వామికి రోజు చీరను ధరింప చేస్తారు. స్వామీ విగ్రహం నిజంగా చాలా అందంగా మోహనంగా కనిపిస్తాడు.

రాణి శాంతలా దేవి మంచి నృత్య కళాకారిణి అయితే కేవలం ఈ స్వామి సన్నిధిలో మాత్రమే నాట్యం చేసేదట. ఆమె కు గల నృత్యాబినివేశము కారణం గానే ఈ దేవాలయంలో అనేక నృత్య భంగిమలు శిల్పాలుగా మలచ బడ్డాయి అనుకోవచ్చును. స్వామి ఎదురుగా వృత్తాకార మండపం ఉంది, ఇక్కడే రాణి నృత్యం చేసేదట.
                   మహా భారత యుద్ధంలో అభిమన్యుని సంహరించడం కోసం నిర్మించిన పద్మవ్యూహం ఇది .





ఈ చిత్రం పద్మిని జాతి స్త్రీ దాని ఆమె తల నుంచి పాదాల వరకు గల అవయవాల నిష్పత్తిని కొలిచి చూపించి పద్మిని జాతి స్త్రీ లకు ఏ విధమైన లక్షణాలు ఉంటాయో గైడ్ వివరించాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం