ప్రపంచంలో పనికిరానిది ఏది ఉండదు .

 మనం ఆలోచించాలే గాని ప్రతీ పని వెనుక ప్రయోజనం ఉంటుంది. ఒక అడవిలో నివసించే వ్యక్తి  ప్రతి రోజు మంచి నీళ్ళకి దూరంగా ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి కావడితో తెచ్చుకొనేవాడు . కావడిలో ఒక కుండకు చిల్లు పడింది . దాని నుంచి నీరు కారిపోతూ ఉండేది . ఇంటికి వచ్చే సరికి సగం నీళ్ళు మాత్రమే మిగిలేవి . ఆటను అలాగే తెచ్చుకొనేవాడు . కాని ఆ కుండకి మాత్రం బాధ కలిగేది . అతని శ్రమకి తగ్గట్టు నేను నీళ్ళు తేలేక పోతున్నాను అని . ఒకరోజు అతనితో చెప్పి బాధ పడింది . నా వలన నీ శ్రమ వృధా అవుతోంది అని . దానికి అతను నవ్వుతూ రేపు ఉదయం నీకు ఒకటి చూపిస్తా చూడు అన్నాడు . మరునాటి ఉదయం నీళ్ళు తేవడానికి వెళుతూ తాను నడిచే దారిని చూడమని ఆ కుండకి చెప్పాడు . రొజూ చిల్లు కుండ తీసుకు వచ్చే వైపు అందమైన గడ్డి పూలు తలలు ఉపుతూ ఆనందంగా చూస్తున్నాయి . రెండో పక్కన కాళీ గా ఉంది . అది చూపించి ఆటను చెప్పాడు . నువ్వు చిల్లు నుంచి కారిపోతున్నాయి అని బాధ పడ్డావు కదా చూసావా ఆ నీళ్ళు పడి మొలచిన గడ్డిమొక్కలు ఎలా పూలు పూచి అందంగా కనిపిస్తున్నాయో . ప్రతి పని వలన ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది . నీ వలన ఈ దారికే అందం వచ్చింది అని .  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం