వంటింటి చిట్కాలు

1. ఖరీదైన గాజుసామాగ్రి శుభ్రం చేస్తున్నప్పుడు చేతిలో నుంచి జారి          పగిలిపోకుండా ఉండకుండా వాటిని తుండుగుడ్డలో చుట్టి శుభ్రం చేయాలి.

2.  గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు,
  చిమటలు ఆదరికిరావు.
3. గచ్చు నేల కడిగేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే, ఆరిన తరువాత ఈగలు వాలవు.


4. గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్‌పేస్ట్ తో రుద్దితే సరి.


5. గులాబీ పువ్వుల రేకులు ఊడి పోకుండా ఉండాలంటే పూలు తేగానే ప్రతీ 
పువ్వు మధ్యన ఒక చుక్క కొబ్బరి నూనె వేయాలి.


6. చింతపండుతో పాటు కొంచెం ఉప్పు కూడా కలిపి రాగి పాత్రలను తోమినట్లైతే తళ తళా మెరుస్తాయి.


7. చేతికి రానంత చిన్నవై పోయిన టాయిలెట్ సోపు ముక్కలు ఎండ బెట్టి తురిమి సర్ఫ్ వంటి పౌడర్‌లలో కలిపి బట్టలు ఉతికితే కమ్మని సువాసనను అందిస్తాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం