ఇంటింటి చిట్కాలు





1. అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే, కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి.

2. కోడిగ్రుడ్డు డొల్లను మెత్తగా పొడిచేసి పాదులకు గానీ, మొక్కలకు గాని వేస్తే మంచి ఎరువులా పని చేస్తుంది.

3. కత్తెరలు గానీ, చాకులు గానీ, పదును పెట్టించుకోవాలన్నప్పుడు, ఒక గరుకు(ఉప్పు)కాగితంతో గట్టిగా రుద్దితే పదునెక్కుతుంది. ఇది ఇంట్లో మనమే చేసుకోవచ్చు.
4. కర్పూరం డబ్బాలో వేసి ఎంత మూతపెట్టినా, కొంత కాలానికి కొంతైనా హరిస్తుంది. నాలుగు మిరియపు గింజలు, నాలుగు బియ్యం గింజలు ఆ డబ్బాలో కర్పూరంతో పాటు వేసి ఉంచితే, కర్పూరం అంత తొందరగా హరించుకుపోదు.
5. కర్ర సామానుల మీద, నేలపై మంచు కురిసినట్లు చెమ్మపడుతూ ఉంటుంది. లీటరు నీటిలో చెంచాడు కడిగే సోడా కలిపి కడగండి. తరువాత శుభ్రమైన నీటితో మరోసారి కడిగి ఆ నేలని ఆరబెడితే మంచిది.
6. కొవ్వొత్తి పత్తికి కాస్త ఉప్పురాస్తే ఎక్కువసేపు కాలుతుంది.
కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువసేపు స్థిరంగా, కాంతిగా వెలుగుతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం