గుడ్ మాస్టార్






 సామర్లకోట లో సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఒక మాష్టారు ఉండేవారు . ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకోని పిల్లలు ఉండేవారు కాదు . ఆయన అంత ఫేమస్ . ప్రతీ ఊర్లో ఎవరో ఒకరు అలాటి మాష్టారు ఉంటారు . మరి అంత గొప్ప ఏమిటనే కదా మీ అనుమానం . అక్కడికే వస్తున్నా ఆయనకు చూపు లేదు . కాని అద్బుతంగా లెక్కలు చెప్పేవారు . పిల్ల వాడు లెక్క చదవగానే ఆయన ఎలా చేయాలో స్టెప్స్ చెప్పే వారు మరొక కుర్ర వాడు బోర్డ్ మీద చేసేవారు . ఎక్కడ తప్పు లేకుండా కళ్ళకు కట్టినట్లు లెక్కలు చెప్పేవారు . ఎంతో మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు .  బాచ్ లు బాచ్ లు గ చెప్పేవారు . చాల ఓపికగా అందరికి లెక్కలు చెప్పి పంపేవారు . ఆయన పుట్టుకతో గుడ్డి వారు కాదు . సామర్లకోట పంచదార ఫేక్టరీ లో పనిచేసేవారు . కొంత కాలానికి క్రమేపీ కనుచూపు తగ్గటంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టారు . ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు కాని అందరు మాత్రం గుడ్డి మాష్టారు అనేవారు . నాకు మాత్రం ఆయన గుడ్ మాస్టారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం