నిదురపోరా తమ్ముడా



అతి నిద్ర వలన అనర్ధాలు ఉన్నట్లే నిద్ర లేమి వలన కూడా దుష్పలితాలు ఉన్నాయి అందుకే తగినంత నిద్ర కావాలి శరీరానికి . సరిపడినంత నిద్ర లేకపోతే ఏమేమి నష్టాలో చూడండి . రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోయేవారితో పోలిస్తే అయిదు గంటలు నిద్ర పోయే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిద్ర లేమి వలన శరీరంలో చక్కర నిల్వలు సమతుల్యత దెబ్బతినడం వలన మధుమేహం వస్తుంది . అయిదు గంటలు కన్నా తక్కువ నిద్ర పోయే వారికి రక్త పోతూ సమస్య కూడా ఉంటుంది . అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉంది . తద్వారా గుండె పోటు రావచ్చు. నిద్ర లేమి వలన ఒత్తిడి పెరగడమే కారణం . అంతేకాదు మెదడులోని భావోద్వేగాలు నియంత్రించే భాగం పని చేయదు అందువలన మానసిక సమస్యలు రావచ్చును . మనం నిద్ర పోయేటపుడు సైటో కీన్స్ అనే రసాయనం విడుదల అవుతుంది .ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది . నిద్రలేమి వలన రోగనిరోధక శక్తి కూడా కోల్పోతాము . నిద్రలేమి ఆకలిని పెంచుతుంది . దానివలన ఊబకాయం వస్తుంది .  ఇన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టే తగినంత నిద్ర అవసరం అంటున్నారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం