పెద్దలకు మాత్రమే


        తెల్లవారుఝామున లేచి చడి చప్పుడు కాకుండా మంచం దిగానుఅందరూ మంచి నిద్రలో ఉన్నారునా భార్యపిల్లలు అందరూ నిద్రావస్థేనెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ హాల్ లోకి వచ్చి , సోఫాలోకి చూస్తే   ’తను’  అక్కడే ఉందినెమ్మదిగా దగ్గరికి వెళ్ళానుపైనున్న వస్త్రాన్ని తొలగించి తదేకంగా చూస్తూ నిలుచున్నాసోఫాలో కూర్చుని 'తనని’  ఒళ్ళో చేర్చుకొని చేతులతో మృదువుగా రాస్తూ ఆనందాన్ని అనుభవించానునాలో ఎన్నాళ్ళగానో  'తనపై'  ఉన్నకోరిక ఇప్పటికి తీరిందని ఆనందించానుఎప్పటినుంచో పెంచుకున్నా' తనపై'  వ్యామోహాన్నిఅటూ ఇటూ చూసి ముద్దు పెట్టుకున్నానుహృదయానికి హత్తుకున్నానుఇలా ’ తనతో’ మౌనంగా ఊసులాడుతుంటే ఇంతలో ఎప్పుడు లేచి వచ్చిందో నా భార్య ఎదురుగా నుంచుందిఏమిటి ? అంత ముద్దు వచ్చేస్తోందా ఉదయాన్నే దాన్ని హత్తుకుని కూర్చున్నారులేచి బ్రష్ చేస్తే కాఫీ ఇస్తాను తాగండిఅయినా ఇరవైనాలుగు గంటలూ ఇంక దానితోనేనా గడపటంకట్టుకున్న ఇల్లాలిని నేనొకదాన్ని ఉన్నానని గుర్తుందాఇంట్లో సహాయం చేసేదేమీ లేదా ఆదివారం కదా కాస్త బజారుకు వెళ్ళి కూరలూ అవీ తేరాఅలా దాన్ని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ రేపు స్కూల్ కి కేరేజ్ లోకి కూరలెవడు తెస్తాడుఅంటూ ఏకధాటిన సణుగుతుంటే మౌనంగా ఉండిపోయా . ఇంక తప్పదనుకొని అప్పటిదాకా ఎంతో అపురూపంగా చూసుకొంటున్న , ఎన్నాళ్ళగానో కొనాలనుకొంటూ ఎట్టకేలకు నిన్ననే కొనుక్కున్న నా కొత్త లాప్ టాప్ ని టీపాయ్ మీద పెట్టి మళ్ళీ గుడ్డకప్పేసా . దుమ్ము పడుతుందని.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం