చక్కనమ్మ చిక్కినా అందమే !
బొద్దు గుమ్మలు సన్నగా ముద్దుగుమ్మలు అయిపోతున్నారు. పూర్వం బొద్దుగా ఉండటమే అందం అని భావించేవారు . ఇప్పుడు అంతా ’స్లిమ్’ మంత్ర కదా! అంద సన్నగా, మెరుపుతీగల్లా మారిపోదామనుకుంటున్నారు. పూర్వం సినిమా తారలను చూడండి. కొంచెం బొద్దుగా ఉండేవారు. ఇప్పుడు అందరూ సన్నగా మారిపోతున్నారు. అందం నిర్వచనం మారిపోయింది. ’జీరో’ సైజ్ లే మోజు లవుతున్నాయి. పాతకాలం నాటి హీరోయిన్స్ ని చూడండి.


మరి ప్రస్తుతం తారలను చూడండి.
ఇది మనుషుల విషయంలోనే కాదు మనం వాడే వస్తువులు కూడా మొదట్లో పెద్దగా ఉండేవన్నీ క్రమక్రమంగా సైజులు ఎలా మారుతున్నాయో గమనించండి. కార్లు చూడండి మొదటి తరం నుంచి ఇప్పటికి ఎలా మారిపోయాయో.


టి.వి లు పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెల్లా ఉండేవి మరి ఇప్పుడు?
మా తాతగారి దగ్గర రేడియో ఇది.
ఇప్పుడు వాడుతున్నవి.
ఇవే కాదు ఫోనులు, కంప్యూటర్స్, వాక్ మెన్ లు, విమానాలు ఒకటేమిటి అన్నీ చిక్కిపోతున్నాయి.