ఇండోర్ ప్లాంట్స్ ఉపయోగాలెన్నో





ఇంట్లో మొక్కలు పెంచుకొంటే కంటికి ఇంపుగా, ఆహ్లాదంగా ఉంటాయి. అంతేకాదు ఇండోర్ ప్లాంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది శాస్త్రజ్ఞులు తెలిపిన విషయం. మొక్కలు మానసిక ఆనందాన్నే కాక సులువుగా శ్వాసించడానికి ఉపయోగపడతాయి కూడా.


     మొక్కలు గాలిని ఫిల్టర్ చేయడంలో బాగా సహకరిస్తాయి. ఇంట్లో మనం ఉపయోగించే రకరకాల వస్తువులు వెలువరిచే విషతుల్య రసాయనాలను ఇవి పీల్చివేస్తాయి. మన పరిసరాలలో వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి. మనం వాడే కార్పెట్లు, ఫర్నిచర్, ఫ్రిజ్ లు, . సి లు, కంప్యూటర్లు, పెయింట్స్, క్లీనర్స్ మొదలైనవి అనేక రకాల రసాయన పదార్దాలను, విషవాయువులను తక్కువ మోతాదులో విడుదల చేస్తాయి.

     మనం ఇంట్లో పెంచే ఇండోర్ ప్లాంట్స్ వీటిని గ్రహించి ఆహారంగా, శక్తిగా మార్చుకొంటాయి. మనకు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పామ్స్, లిల్లిస్ మొదలైన మొక్కలను ఇండోర్ ప్లాంట్స్ గా గదులలో పెంచుకోవచ్చును. ఇవి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం