
పోస్ట్‌లు
2014లోని పోస్ట్‌లను చూపుతోంది
ఎత్తును పెంచే హార్మోన్ థెరపీ
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కన్నబిడ్డలు నిలువెత్తు పెరగాలన్న కాంక్ష అందరికీ ఉంటుంది. కానీ, కొంతమంది పిల్లల్లో ఆ ఎదుగుదల సవ్యంగా సాగకుండా ఏవో అవరోధాలు వచ్చిపడుతుంటాయి. ఎత్తు పెరగడం అన్నది బాల్యంతో ముడివడిన అంశం. అందుకే ఎదగడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే అన్ని చర్యలూ ఇప్పుడే చేపట్టాలి. అందుకు పిల్లల ఎదుగుదలను పిన్నవయసునుంచే నిశితంగా గమనిస్తూ ఉండాలి. లోపాలను చక్కదిద్దే విషయంలో ఏ ప్రయత్నం చేసినా 16 మహా అయితే 18 ఏళ్ల లోపే . ఆ వయసు దాటిపోతే ఇంక ఏ వైద్యవిధానాలూ ఏమీ చేయలేవు. పిల్లలు ఏపుగా ఎదగాలని కోరుకుంటే సరిపోదు. అది కుంటుపడిపోతున్నపుడు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు నిపుణులు... ఎలా తెలియాలి ? తమ పిల్లలు ఏపుగా ఎదుగుతున్నారో లేదో తెలుసుకునేందుకు తల్లిదండ్రులకు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. పీడియాట్రిషియన్లు, ఎండోక్రినాలజిస్టులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇవి రూపొందాయి. సాధారణంగా 4నుంచి 8 ఏళ్లలోపు పిల్లలంతా దాదాపుగా ఒకే ఎత్తుతో ఉంటారు. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే తమ పిల్లలు చదివే తరగతిలోని మిగతా పిల్లలందరితో అప్పుడప్పుడు పోల్చి చూస్తుంటే ఆ ...