పెద్దలకు మాత్రమే
తెల్లవారుఝామున లేచి చడి చప్పుడు కాకుండా మంచం దిగాను . అందరూ మంచి నిద్రలో ఉన్నారు . నా భార్య , పిల్లలు అందరూ నిద్రావస్థే . నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ హాల్ లోకి వచ్చి , సోఫాలోకి చూస్తే ’ తను ’ అక్కడే ఉంది . నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాను . పైనున్న వస్త్రాన్ని తొలగించి తదేకంగా చూస్తూ నిలుచున్నా . సోఫాలో కూర్చుని ' తనని’ ఒళ్ళో చేర్చుకొని చేతులతో మృదువుగా రాస్తూ ఆనందాన్ని అనుభవించాను . నాలో ఎన్నాళ్ళగానో ' తనపై' ఉన్నకోరిక ఇప్పటికి తీరిందని ఆనందించాను . ఎప్పటినుంచో పెంచుకున్నా' తనపై' వ్యామోహాన్ని . అటూ ఇటూ చూసి ముద్దు పెట్టుకున్నాను . హృదయానికి హత్తుకున్నాను . ఇలా ’ తనతో ’ మౌనంగా ఊసులాడుతుంటే ఇంతలో ఎప్పుడు లేచి వచ్చిందో నా భార్య ఎదురుగా నుంచుంది . ఏమిటి ? అంత ముద్దు వచ్చేస్తోందా ఉదయాన్నే దాన్ని హత్తుకుని కూర్చున్నారు . లేచి బ్రష్ చేస్తే కాఫీ ఇస్తాను తాగండి . అయినా ఇరవైనాలుగు గంటలూ ఇంక దాన